Tue Mar 31 2026 05:39:39 GMT+0530 (India Standard Time)
నేడు జగన్ శిబిరంలోనే....!

వైసీపీ అధినేత జగన్ నేడు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈరోజు శుక్రవారం కోర్టుకు సెలవు అయినప్పటికీ ఆయన పాదయాత్రకు విరామం ప్రకటించారు. జగన్ ఈరోజు గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో జగన్ ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు. నెల్లూరు జిల్లా సగుటూరులో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రతి శుక్రవారం జగన్ హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఈరోజు కోర్టుకు సెలవు. అయినా జగన్ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఈరోజు పాదయాత్రకు విరామం ప్రకటించారు. కాళ్లకు బొబ్బలు లేవడంతో జగన్ ఈరోజు శిబిరంలోనే విశ్రాంతి తీసుకోనున్నారు.
- Tags
- జగన్
Next Story

