Wed Mar 25 2026 09:41:02 GMT+0530 (India Standard Time)
నిరూపిస్తే ఉరేసుకుంటా

విజయసాయిరెడ్డి మోడీ కాళ్లు పట్టుకున్నా కేసుల నుంచి కాపాడలేడని మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. తాను బెంగళూరులో ట్రస్ట్ నడుపుతుంటే, క్లబ్ నడుపుతున్నారని ఆరోపణలు చేస్తారా? అని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి నీచాతినీచంగా మాట్లాడుతున్నారన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఊరేసుకుంటానని మంత్రి ఆది సవాల్ విసిరారు. విజయసాయిరెడ్డికి మతి భ్రమించి గతి తప్పి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కేంద్రం రాష్ఠ్రానికి పిడికెడు పిండాకూడు మెతుకులు వేసిందన్నారు. పవన్ సినిమాల్లో సిల్లీ క్యారెక్టర్ లాంటి వారని మంత్రి ఆదినారాయణరెడ్డి ఎద్దేవా చేశారు.
Next Story

