Wed Mar 25 2026 11:10:29 GMT+0530 (India Standard Time)
నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తే ఊరుకోను

తెలుగుదేశం పార్లమెంటు సభ్యులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు క్లాస్ పీకారు. ఈరోజు జరిగిన టెలి కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ ఎవరూ కేంద్రం పెద్దలతో రహస్య మంతనాలు చేయవద్దన్నారు. అలాగే ఢిల్లీకి వచ్చిన తెలుగువారికి సహకరించాలని ఎంపీలను చంద్రబాబు ఆదేశించారు. నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో కొందరు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. తాము ప్రత్యేక హోదా, ఏపీ విభజన హామీల అమలు కోసం ఆందోళన చేయడానికి ఢిల్లీకి వెళితే తెలుగుదేశం పార్టీ ఎంపీలు తమకు సహకరించలేదని కొందరు తనకు ఫిర్యాదు చేశారన్నారు. ఢిల్లీకి వచ్చిన వారికి సహకరించడం మన బాధ్యతగా గుర్తుంచుకోవాలన్నారు. ఏపీ భవన్ ను వేదికగా చేసుకుని సమన్వయం చేసుకోవాలన్నారు. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తే ఒప్పుకునేది లేదని ఎంపీలకు చంద్రబాబు సీరియస్ గానే చెప్పారు. మీ చర్యలను ప్రజలందరూ చూస్తున్నారన్నారు.
Next Story

