నయీం బాధితులంతా ఒక్కటై....!

గ్యాంగ్ స్టర్ నయీం బాధితులు ఏకమయ్యారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితులందరు కలిసి ఒక సంఘం గా ఏర్పడ్డారు. నయీం బాధితుల సంఘంగా ఏర్పడిన దీనికి పలువురు కమ్యునిస్టు నేతలు కూడా మద్దతు ప్రకటించారు. వామపక్ష ఉద్యమాన్ని అణిచి వేయడానికే నయీమ్ ను తయారు చేశారని వామపక్ష పార్టీలు అభిప్రాయపడ్డాయి. పోలీసుల సహకారంతోనే బెల్లి లలిత లాంటి వారిని నయీం చంపేశాడన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఇందులో ఉందని తీవ్రంగా విమర్శించారు. నయీం బతికి ఉంటే అమిత్ షా లాంటి వాళ్లు కూడా జైలులో ఉండేవారని, సోహ్రాబుద్దీన్ కేసులో నయీం ప్రధాన సూత్రధారి అని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు.
ఉన్నత స్థాయి విచారణ జరపాలంటూ....
నయీం బాధితులకు న్యాయం చేయాలనని, నయీం ఎన్ కౌంటర్ పై ఉన్నతస్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేవఆరు. సిట్ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా విచారణ ఉందన్నారు. సిట్ వల్ల నయీం బాధితుల్లో ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదన్నారు. చిన్న వారిని పట్టుకుని పెద్దవాళ్లను విడిచిపెట్టారన్నారు. నయీంకు రాజకీయ నేతల అండదండలున్నాయని, కాని వారిని ఈ కేసులో ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. నయీం బాధితులందరికీ న్యాయం జరిగేంతవరకూ పోరాటం ఆగదని వామపక్ష నేతలు స్పష్టం చేశారు.
- Tags
- నయీం

