Sat Apr 11 2026 06:30:15 GMT+0530 (India Standard Time)
నయీం అనుచరుడు ఏం చేశాడంటే...?

గ్యాంగ్ స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుడు జైల్లో ఉండి కూడా సెటిల్ మెంట్లు చేస్తున్నట్లు బయటపడింది. కోర్టుకు పోలీసులు తీసుకొచ్చే సమయంలో పాశం శ్రీను ఈ సెటిల్ మెంట్లు చేస్తున్నారని తేలింది. భువనగిరి కోర్టు వాయిదాలకు పాశం శ్రీను వచ్చేటప్పుడు పెంబర్తి డాబా హోటల్ వద్ద ఈ సెటిల్ మెంట్లు చేశావాడని తెలిసింది. కొందరిని ఫోన్లో పాశం శ్రీను బెదిరించడంతో్ ఈ విషయం బయటకు వచ్చింది. నయీం పాత అనుచరులైన సాయికృష్ణ, అంగడి నాగరాజు, మెరుగు శివశంకర్, పులి శ్రీనివాస్, పాశం శ్రీను తమ్ముడు కౌన్సిలర్ అమరనాథ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. పాశం శ్రీనుకు సహకరించిన పోలీసులు కానిస్టేబుళ్లను రాచకొండ పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు.
- Tags
- నయీం పాశం శ్రీను
Next Story

