దటీజ్ తలైవర్ .....? ఏమి రెస్పాన్స్?

సామాన్య మధ్యతరగతి నుంచి ఎవరు అందుకోలేని స్థాయికి ఆ బస్ కండెక్టర్ ఎదిగారు. తలైవా ( నాయకుడు) బిరుదు ను సార్ధకం చేసుకునేలా తమిళ వెండితెర ఇలవేల్పు అయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా తన నటనా కౌశలంతో అభిమానులను కోట్లాదిగా భాషతో సంబంధం లేకుండా సంపాదించుకున్నారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని ఆధ్యాత్మిక భావనలతో జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతూ కల్లోల రాజకీయాల్లోకి వచ్చేశారు రజనీకాంత్. ఎప్పుడు వస్తానో తెలియదు రావడం మాత్రం పక్కా అని ఒక సినిమాలో చెప్పిన డైలాగ్ ను సత్యం చేసిన రజనీ వచ్చి రావడంతోనే తన తడాఖా చూపారు.
ఒక్క రోజులో 50 లక్షల సభ్యత్వం ...
రాజకీయాల్లో ఆసక్తి ఉండి తనతో కలిసి పనిచేయాలని భావిస్తే తనకొత్త పార్టీలో చేరేందుకు సభ్యత్వాన్ని ఆహ్వానించారు రజని. అందుకోసం ఒక వెబ్ సైట్ ప్రారంభించారు. ఆయన పిలుపు ఇవ్వడమే ఆలస్యం లక్షల సంఖ్యలో ఆయన్ను అభిమానించే వారు సునామీలా రజనీ పార్టీ సభ్యత్వ తీర్ధం పుచ్చుకున్నారు. ఇది తమిళనాటే కాదు యావత్తు దేశంలో సరికొత్త రికార్డ్ అనే చెప్పాలి. రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం నుంచి ఆయన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. భాషా రాజకీయ అడుగులను తమిళనాడులోని అన్ని రాజకీయపక్షాలు ఉత్కంఠగా ఆసక్తిగా గమనిస్తున్నాయి. మొత్తానికి రజని వెబ్ సభ్యత్వం సునామీని సృష్ట్టించిందనే చెప్పాలి. మరి ఇదే స్పీడ్ 2019 ఎన్నికల వరకు రజని పార్టీ కొనసాగిస్తుందో లేదో చూడాలి.
రజని పార్టీ తో పికె పార్టీ నడుమ పోలిక చూస్తున్న నెటిజెన్స్...
రజని కాంత్ పార్టీ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో కొత్త పార్టీ జనసేనతో నెటిజెన్స్ పోలిక చూస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తెలుగు రాష్ట్రాల్లో ప్రభావంతమైన సినీ గ్లామర్ వున్న హీరో కావడంతో వీరిద్దరి నడుమ పోలికలు, తేడాలు లెక్కలేస్తున్నారు సామాజిక మాధ్యమాల్లో. పవన్ పార్టీ పెట్టి సుమారు నాలుగేళ్లు అవుతున్నా బండి న్యూట్రల్ గేర్ లో ఉందని, అదే రజని పార్టీ పెట్టడం సభ్యత్వ నమోదు లక్షల్లో నమోదు కావడం చూడాలంటున్నారు నెట్ జనం. పికె మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇటు టిడిపి ప్రభుత్వానికి, అటు తెలంగాణాలో టిఆర్ఎస్ లకు బ్రాండ్ గా మారడంతో జనసేనపై అంచనాలు తలక్రిందులు అవుతున్నాయన్న సెటైర్స్, పంచ్ లు పెరిగిపోతున్నాయి.
- Tags
- రజనీకాంత్

