Mon Apr 06 2026 18:09:37 GMT+0530 (India Standard Time)
తొలిరాత్రినే కాళరాత్రిగా మార్చిన శాడిస్ట్ మొగుడు

చిత్తూరు జిల్లా జిడి నెల్లూరు మండలం మోర్ధాన్ పల్లెలో దారుణం చోటు చేసుకుంది. శైలజ,రాజేష్ కు ఇటీవల వివాహం అయింది. శైలజ డాక్టర్ వృత్తి చేస్తుండగా రాజేష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అయితేపెళ్లయిన తర్వాత పెద్దలు శోభనం ఏర్పాటు చేశారు. ఉదయం పెళ్లి జరిగింది. రాత్రికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. అయితే రాజేష్ శాడిస్ట్ లాగా వ్యవహరించాడు. మొదటి రాత్రి మధురానుభూతులను పంచాల్సిన మొగుడు యముడుగా మారాడు. శైలజను బ్లేడుతో కోసి రాజేష్ పైశాచికానందం అనుభవించాడు. సైకోలా మారి భార్యపై బ్లేడుతో దాడి చేశాడు. దీంతో నవ వధువు శైలజ చావుబతుకుల మధ్య ఆసుపత్రిలోచేరింది. పోలీసులు నిందితుడు రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు.
- Tags
- శాడిస్ట్ మొగుడు
Next Story

