తెలంగాణాలో టీడీపీ... ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు నడుస్తున్నాయా ..?

తెలంగాణాలో ప్రస్తుతం నడుస్తుంది టిఆర్ ఎస్ ప్రభుత్వం కాదు తెలుగుదేశం ప్రభుత్వం అట. అలాగే ఏపీలో నడిచేది తెలుగుదేశం ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అట. వినడానికి ఆసక్తిగా అనిపించే ఈ వ్యాఖ్యలు చేసింది సాదా సీదా వ్యక్తి కాదు. దశాబ్దాల కాలం తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబుకి ఒకప్పుడు అత్యంత నమ్మకస్తుడైన నేత. తెలంగాణాలో టిడిపి ని బాబు వదిలి పెట్టేయడంతో గత్యంతరం లేక టిఆర్ ఎస్ లోకి చేరిన ఎర్రబెల్లి దయాకరరావు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణాలు కూడా వున్నాయండో.
రెండు ప్రభుత్వాల క్యాబినెట్ లలో ఉన్నది ఎవరు .....
ఎర్రబెల్లి చెబుతున్నది కూడా ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది. చంద్రశేఖర రావు క్యాబినెట్ లో ఉన్నది ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ నుంచి టిఆర్ ఎస్ లోకి వచ్చిన వారు వస్తే పదవి దక్కించుకున్న వారే కనిపిస్తారు. ఏపీలో సైతం టిఆర్ ఎస్ ఫార్ములా పక్కాగా ఫాలో అయిన చంద్రబాబు కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగి టిడిపిలోకి జంప్ అయి వచ్చిన వారే కనిపిస్తారు. విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ కి మనుగడ లేదని వాసన పసిగట్టిన నేతలు టిడిపికి జంప్ అయ్యారు. అలా అయిన వారిలో గంటా శ్రీనివాసరావు, తోటనరసింహం వంటి అనేకమంది కనిపిస్తారు. వీరుకాక పితాని సత్యనారాయణ, ఆదినారాయణ రెడ్డి వంటివారు వైసిపిలో గెలిచి గోడ దూకారు. వీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల సమయంలో క్యాబినెట్ లో వున్నవారు కొందరు. తెలంగాణాలో కూడా మంత్రి తలసాని శ్రీనివాసరావు, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర రావు లు టిడిపి నుంచి పోయిన వారే. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ ప్రొడక్ట్ అయితే కేసీఆర్ టిడిపి ప్రొడక్ట్ గా చెప్పుకోవొచ్చు. ఇవన్నీ పరిశీలిస్తే దయాకర రావు కామెంట్స్ లో తప్పేమి లేదు మరి.ఒక టివి ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎర్రబెల్లి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
- Tags
- టీడీపీ కాంగ్రెస్

