Thu Mar 26 2026 11:41:00 GMT+0530 (India Standard Time)
తాము ఆ పనిచేయబోమన్న వైసీపీ

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఏ పార్టీ ముందుకు వచ్చినా మద్దతిస్తామని తెలిపింది. టీడీపీ లాగా తాము వెనక్కు వెళ్లే ప్రసక్తి లేదని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు. తాము పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని చెప్పి తర్వాత టీడీపీ వెనక్కు తీసుకుందన్నారు. కాని తాము ఆ పని చేయబోమని విజయసాయి రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించడానికి టీడీపీ పెట్టిన అవిశ్వాసానికి మద్దతిస్తామని ఆయన ప్రకటించారు. తాము పెట్టిన అవిశ్వాసానికి బీజేపీ, టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయని విజయసాయిరెడ్డి తెలిపారు.
- Tags
- వైసీపీ
Next Story

