Wed Apr 01 2026 03:04:34 GMT+0530 (India Standard Time)
తాగుబోతు యువతి ఏం చేసిందంటే...!

మద్యం తాగిన మైకంలో కారు నడుపుతూ హైదరాబాద్ లో ఓ యువతి హల్ చల్ చేసింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేసిన ట్రాఫిక్ పోలీసులతో తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దిగింది సుహాని అనే యువతి. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు చాలాసేపు వరకు సహకరించకుండా పోలీసులకు చుక్కలు చూపించింది. ఆల్కహాలు 61 పర్సంటేజ్ రావడంతో కేసు బుక్ చేస్తుండగా.. తప్పించుకుని పారిపోబోయింది. దాంతో ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు వెంబడించి మరీ తాగుబోతు యువతిని పట్టుకుని కేసు బుక్ చేసి.. ఆమె కారును సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ లో ఆరు ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో తాగి వాహనాలు నడుపుతూ 59 మంది పోలీసులకు చిక్కారు. 34 కార్లు, 25 బైకులను సీజ్ చేశారు పోలీసులు.. పట్టుబడిన వారందరినీ కౌన్సిలింగ్ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు పోలీసులు.
- Tags
- మద్యం తాగి యువతి
Next Story

