డి గ్యాంగ్ కు వారసుడు లేడా?

డాన్ దావూద్ ఇబ్రహీం కు కన్న కొడుకే షాకిచ్చాడు. దావూద్ ఇబ్రహీం కరడు గట్టిన నేరగాడు. నేర సామ్రాజ్యానికి అధిపతి. అటువంటి దావూద్ కు వారసుడు ఉన్నా లేనట్లేనని తేలిపోయింది. తాను కొన్ని దశాబ్దాలుగా నిర్మించిన సామ్రాజ్యాన్ని ఏలేందుకు ఆయన వారసుడు అంగీకరించలేదు. దీంతో దావూద్ తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. థానే యాంటీ ఎక్స్ టర్నల్ సెల్ చీఫ్ ప్రదీప్ శర్మ ఈ వివరాలను వెల్లడించారు. దావూద్ కు ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పేరు కస్కర్. 31 ఏళ్ల వయస్సున్న కస్కర్ కు వ్యాపారాలంటే ఇష్టం లేదట. ఆయన మతపెద్దగా మారిపోవాలని నిర్ణయించుకున్నాడట.
కొడుకు పూర్తి వ్యతిరేకం.....
కస్కర్ మతబోధకుడిగా మారాలని నిర్ణయించుకోవడంతో దావూద్ ఇబ్రహీం తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నాడు. తన వారసుడు అడ్డం తిరగడంతో తన సామ్రాజ్యానికి వారసుడెవరో తెలియక దావూద్ సతమతమవుతున్నారు. కస్కర్ తొలి నుంచి తండ్రి దావూద్ ను వ్యతిరేకిస్తున్నాడు. దావూద్ ను కలిసేందుకు కూడా కస్కర్ ఇష్టపడటం లేదు. దీంతో దావూద్ మానసిక వేదనను అనుభవిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో దావూద్ ఆరోగ్యంపై కూడా అనేక ప్రచారాలు జరిగాయి. దావూద్ చివరి క్షణాల్లో ఉన్నారని కూడా వార్తలొచ్చాయి.
- Tags
- దావూద్ ఇబ్రహీం

