టెక్నలాజీ తో జనంలోకి జనసేన

ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆధునిక టెక్నలాజిని రాజకీయ పార్టీలు అందిపుచ్చుకుంటున్నాయి. ఆ బాటలోనే జనసేన కూడా అడుగులు వేయబోతుంది. ఢిల్లీ లోని ఆప్ పార్టీతో పాటు బిజెపి, కాంగ్రెస్ లు సైతం అత్యాధునిక సాంకేతికతనే పార్టీ నిర్మాణంలో విరివిగా వినియోగిస్తున్నాయి. పార్టీ వెబ్, ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్ లకు పార్టీని అనుసంధానం చేసి నేరుగా ప్రజల్లోకి వెళుతున్నాయి. ఇది చాలా ఖర్చును తగ్గించడంతో బాటు నేరుగా ప్రజలను పార్టీతో అనుసంధానం చేస్తుంది.
పనిభారం తప్పింది....
ఈ విధానంతో క్యాడర్ కి కూడా పనిభారం తప్పింది. అనవసర వ్యయాలు తగ్గడంతో బాటు సభ్యత్వ నమోదు సైతం వాస్తవికంగా నమోదు అవుతుంది. జనసేన ఈ పద్ధతినే అనుసరించబోతున్నట్లు గుంటూరు సభలో పవన్ స్పష్టం చేశారు. మిస్డ్ కాల్ ద్వారా సభ్యత్వం తీసుకోవొచ్చని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే జనసేన ఆన్ లైన్ సభ్యత్వాలనే స్వీకరిస్తూ వచ్చింది. ఇప్పడు మొబైల్ అనుసంధానిత ప్రక్రియకు జనసేనాని శ్రీకారం చుట్టడంతో పార్టీ సభ్యత్వాలు మరింత భారీగా పెరగనున్నాయి.
రజనీకాంత్, కమల్ హాసన్ ది అదే బాట ....
తమిళనాడులో పుట్టుకొచ్చిన రెండు ప్రాంతీయ పార్టీలు అత్యాధునిక సాంకేతికతే ఆలంబనగా దూసుకుపోతున్నాయి. రజనీకాంత్, కమల్ హాసన్ ల పార్టీలు ఇప్పటికే ఆన్ లైన్ సభ్యత్వాలతో దడదడ లాడిస్తున్నాయి. పార్టీ సభ్యత్వాల పేరిట అవకతవకలకు ఆస్కారం లేకుండా ఈ ప్రక్రియ అన్ని పార్టీలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండటంతో పాటు వేగవంతంగా పూర్తి కావడం నిధుల దుర్వినియోగం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. సో రాబోయే 2019 ఎన్నికలు అంతా డిజిటల్ వార్ గా నడవనున్నాయన్నది స్పష్టమౌతుంది.
- Tags
- జనసేన
