Fri Apr 10 2026 08:23:05 GMT+0530 (India Standard Time)
టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అనంతపురం జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కు సీబీఐ హైకోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. డీడీల ఫోర్జరీ కేసులో ఈ మాజీ ఎమ్మెల్యే మోసం చేశారని సీబీఐ కోర్టు గుర్తించింది. కందికుంట వెంకటప్రసాద్ తో పాటు ఆయనకు సహకరించిన అసిస్టెంట్ మేనేజర్ నర్సింగరావుకు కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. నకిలీ డీడీలు సృష్టించి మోసం చేశారని వెంకటప్రసాద్ పై ఆరోపణలున్నాయి. కందికుంట వెంకటప్రసాద్ ప్రస్తుతం కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
Next Story

