Fri Apr 10 2026 11:32:15 GMT+0530 (India Standard Time)
టీడీపీకి మరో షాక్...!

టీడీపీ నేతలు వరుస పెట్టి పార్టీని వీడి వెళుతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు కొద్దిసేపటి క్రితం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి పంపారు. రేపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ పార్టీ కండువా కప్పుకోనున్నారు. రేపు పెద్దయెత్తున వివిధ జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని సమాచారం.
- Tags
- టీడీపీ
Next Story

