జనసేన యాక్టివ్ తో టిడిపి, వైసీపీల్లో గుబులు

కార్తీకమాసం ప్రారంభం కావడంతో మంచి రోజులు వచ్చాయని జనసేన పార్టీ తన పని మొదలు పెట్టింది. దాంతో ఏపీలో తెలుగుదేశం, వైసిపిలో గుబులు మొదలైంది. ఏ పార్టీ తో పొత్తు లేకుండా జనసేన దిగితే ఎవరి కొంప మునుగుతుందో అర్ధంకాక రెండు పార్టీలు కిందా మీదా పడుతున్నాయి. టిడిపి తో పొత్తు ఉంటే తమకు ఎంత నష్టం అన్నది వైసిపి ఆలోచిస్తుంటే, తమతో పొత్తు కాకుండా వైసీపీతో వెళితే తమకు ఎంత నష్టమన్నది టిడిపి అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే పవన్ జనసేన తెలంగాణాలో పోటీకి కూడా సిద్ధమని ప్రకటించడంతో అక్కడ పికె పార్టీ పై హాట్ టాపిక్ నడుస్తుంది.
ప్లీనరీకి పవన్ సన్నాహాలు ...
జనసేన పార్టీ ప్లీనరీ ఏర్పాటు దిశగా అధినేత పవన్ ఆలోచన చేస్తున్నారని సమాచారం. ముందుగా ఆన్ లైన్ సభ్యత్వాల ప్రక్రియ పూర్తి చేసి ఆపై ప్లీనరీ నిర్వహించి పార్టీ విధి విధానాలు ఖారారు చేయాలని భావిస్తున్నారు. ఆ తరువాత తెలుగు రాష్ట్రాల్లో అధినేత యాత్రపై ప్లాన్ చేయాలని పార్టీ శ్రేణులు సూచించాయి. జనసేన ముఖ్యులతో పవన్ సమావేశంలో కీలక అంశాలపై చర్చ కొనసాగింది. ప్రస్తుత ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చాయి. నవంబర్ నుంచి జనసేన జోరుమీద వుండే వాతావరణం స్పష్టం అయ్యింది. పవన్ కొద్దిరోజుల్లోనే యాత్రపై స్పష్టత ఇస్తారు. అలాగే ప్లీనరీకూడా పెద్దయెత్తున నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.
- Tags
- జనసేన

