జగన్ వైఖరిలో ఇంత మార్పా ...?

రాష్ట్ర ప్రభుత్వం తప్పులను పదే పదే విమర్శించే వైసిపి అధినేత జగన్ లో తీవ్ర మార్పు వచ్చేసింది. ప్రకాశం జిల్లాలో పాదయాత్రలో వున్న జగన్ ఇప్పడు కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం చర్చనీయాంశంగా మారింది. కేంద్రంపై పల్లెత్తు మాట అనడంలేదంటూ టిడిపి శ్రేణులు నిన్న మొన్నటివరకు చెప్పిన మాట చెప్పకుండా చేసిన ఆరోపణ చేయకుండా విపక్ష నేతపై విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ వ్యాఖ్యలు సంచలనమే అయ్యాయి. అసలు జగన్ కేంద్రంపై ఇలా యూటర్న్ తీసుకుంటే తమ పరిస్థితి ఏమిటని టిడిపి శిబిరంలో చర్చలు నడుస్తున్నాయి.
వైసిపి అధినేత బిజెపిని ఏమన్నారంటే ...?
రాష్ట్ర విభజన బిల్లు రాజ్యసభకు చేరుకున్నాక వెంకయ్య నాయుడు చేసిన హడావుడిని జగన్ గుర్తు చేస్తూ పంచ్ లు విసిరారు. రాజ్యసభలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెబితే కాదు పదేళ్లు కావాలంటూ నాడు వెంకయ్య నాయుడు డిమాండ్ చేయడం, పదేళ్లు కాదు కాదు పదిహేనేళ్ళు అంటూ చంద్రబాబు డిమాండ్ చేయడాన్ని గుర్తు చేశారు జగన్. అలా చెప్పిన ఇద్దరు ఇప్పడూ ఏమై పోయారన్నది జగన్ ప్రశ్న. ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయకపోతే ఎలా అంటూ విరుచుపడ్డారు విపక్ష నాయకుడు. సో జగన్ తన మీద టిడిపి చేస్తున్న ఆరోపణలను ప్రజాక్షత్రంలోనే ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. బిజెపి తో అంటకాగేది లేదని మరోసారి తనవ్యాఖ్యలతో చెప్పక చెప్పినట్లు అయ్యింది.
- Tags
- జగన్
