జగన్ యాత్రపై డేగకన్ను....!

విపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో అధికార యంత్రాంగంలోని కొందరు మమేకమై సేవలు చేయడాన్ని సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వ అధికారులు గా ఉండి వారు చేయాలిసింది ఏమిటి ? చేస్తున్నది ఏమిటి ? అని తలపట్టుకుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో రెచ్చి పోయి మరి కొందరు జగన్ కి జై కొట్టడాన్ని టిడిపి సర్కార్ జీర్ణించుకోలేక అవస్థలు పడుతుంది. ప్రభుత్వ అధికారులు పాదయాత్రలో ఏమేం చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు తెలుసుకునే బృందాన్ని రంగంలోకి దింపి నివేదికలు తెప్పించుకుని పరిశీలిస్తుంది. విపక్ష నేతకు ఎందుకు వారు సహాకారం అందిస్తున్నారు అనే కూపీ లాగే ప్రయత్నాలు ఇటు పార్టీ అటు ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరిస్తున్నాయి.
యాత్రకు సహకరిస్తున్న అధికారులు....
వైసిపి నేత జగన్ పాదయాత్రలో ఒక ఎస్ ఐ చేతిలో చేయి వేసుకుని పార్టీ కార్యకర్తలా మారిపోయి తిరగడం, మరో ఇరిగేషన్ అధికారి యాత్ర కు వచ్చిన వారికి వసతి సౌకర్యాలు చూడటం సదా వారి సేవలో తరించడం చిత్తూరు తెలుగు తమ్ముళ్లకు తలబొప్పి కట్టేలా చేసింది. చాలా కాలంగా అధికార యంత్రాంగం తమ మాట లెక్కచేయడం లేదని అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఇప్పుడు చూడండి అని వాపోతున్నారు తమ్ముళ్లు. మంత్రి ఆదినారాయణ రెడ్డి అండదండలతోనే కొందరు అధికారులు తమ పోస్టింగ్స్ వేయించుకుని మరి ఇలా చేస్తున్నారని అవకాశం దొరకడంతో ఎప్పటినుంచో పార్టీలో వున్న సీనియర్ నేతల ఫిర్యాదు. దాంతో ఇప్పుడు దేశం అధినాయకత్వం సైతం ఎన్నికల ఏడాది కావడంతో గట్టి చర్యలు తీసుకుని ఇతర జిల్లాల అధికారులు వీరిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోకుండా ఏం చేయాలా అనే వ్యూహంలో తలమునకలైంది. టిడిపి సర్కార్ తాజా వ్యూహం ఫలిస్తుందో లేక అధికార యంత్రాంగం తో ఇలాగే జగన్ టీం హాయిగా పనులు చేయించుకుంటుదో చూడాలి.
- Tags
- జగన్

