Fri Apr 03 2026 18:31:07 GMT+0530 (India Standard Time)
జగన్ మరో మైలురాయి దాటారు....!

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 600 కిలోమీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం జగన్ అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. 43వ రోజు పాదయాత్రలో భాగంగా కటారు పల్లి గ్రామం వద్ద 600 కిలోమీటర్ల మైలురాయిని జగన్ దాటారు. అందుకు గుర్తుగా జగన్ అక్కడ మొక్క నాటారు. అక్కడే పార్టీ జెండాను ఆవిష్కరించారు. కటారుపల్లి గ్రామస్తులతో ఆయన సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
- Tags
- జగన్
Next Story

