Tue Apr 07 2026 11:46:14 GMT+0530 (India Standard Time)
జగన్ బయలుదేరారు...!

కర్నూలులో జరుగుతున్న పాదయాత్రకు ఒకరోజు విరామమిచ్చి హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరైన జగన్ ఈరోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకూ సీబీఐ కోర్టులోనే ఉన్నారు. జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులపై విచారణ జరిగింది. ముఖ్యంగా రాంకీ ఛార్జిషీట్ దాఖలైన డిశ్చార్జ్ పిటీషన్ పై వాదనలు జరిగాయి. ఈ విచారణను వచ్చే నెల ఎనిమిదో తేదీకి వాయిదా వేశారు. కోర్టుకు జగన్ తో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా హాజరయ్యారు. నాంపల్లి కోర్టులో విచారణ ముగిసిన అనంతరం జగన్ నేరుగా కర్నూలు బయలుదేరి వెళ్లిపోయారు.
- Tags
- జగన్
Next Story

