జగన్ ఫుల్ హ్యీపీస్.... ఎందుకంటే...?

వైఎస్ జగన్ లండన్ నుంచి వచ్చారు. వారం రోజులు లండన్ లో పర్యటించి వచ్చిన అనంతరం ఈరోజు వైసీపీ ముఖ్యనేతలతో జగన్ సమావేశమయ్యారు. శుక్రవారం జగన్ తిరుమలకు బయలుదేరి వెళ్లనున్నారు. తిరుమలలో శుక్రవారం రాత్రి బసచేసి శనివారం శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం శనివారం సాయంత్రానికి పులివెందుల చేరుకుంటారు. ఆదివారం చర్చిలో ప్రార్థనలు చేసిన అనంతర అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుని వైఎస్ సమాధికి నివాళులర్పించి పాదయాత్రను 6వ తేదీ ఉదయంనుంచి ప్రారంభిస్తారు. అక్కడే ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే జగన్ ఈరోజు జరిగిన సమావేశంలో పాదయాత్ర ఏర్పాట్లపై సమీక్షించినట్లు తెలిసింది. అయితే ఏర్పాట్లన్నీ పక్కాగా జరుగుతున్నట్లు తెలియడంతో జగన్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు.
పూటకు ఐదువేల మందికి భోజనాలు....
ఇప్పటికే జగన్ ప్రయాణించే మార్గంలో కటౌట్లు, ఫ్లెక్సీలతో వైసీపీ అభిమానులు నింపేశారు. అంతేకాకుండా జగన్ వెంట వచ్చే వారికి, జగన్ కు విశ్రాంతి తీసుకునేందుకు మధ్యాహ్నం ఎక్కడ ఆగుతారనేది ముందుగానే నిర్ణయించి అక్కడ స్థలాన్ని చదును చేయిస్తున్నారు. ముందుగానే అంచనా వేసిన స్థలానికి జగన్ చేరుకోవాల్సి ఉంటుంది. జగన్ వెంట వచ్చే వారందరికీ భోజన సదుపాయాలు కల్పించనున్నారు. భోజనాల తయారీకి ఒక టీంను సిద్ధంచేశారు. ఒకరోజు ముందుగానే వెళ్లి పూటకు ఐదు వేల మందికి భోజన సదుపాయాలుచేయాల్సిందిగా ఇప్పటికే వారికి ఆదేశాలందాయి. ఈ మేరకు జగన్ ఈరోజు జరిగన సమీక్షలో పాదయాత్ర జరుగుతున్న సమయంలో నియోజకవర్గాల్లో ఏఏ పనులు చేపట్టారో పార్టీ కార్యాలయం నుంచి నివేదిక తెప్పించుకుని చూశారు. సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
- Tags
- జగన్

