Mon Apr 06 2026 07:59:55 GMT+0530 (India Standard Time)
జగన్ పై పవన్ విసుర్లు

వైసీపీ నేత జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విసుర్లు వేశారు. అవినీతి ఆరోపణలు ఉండబట్టే గత ఎన్నికల్లో జగన్ కు తాను మద్దతివ్వలేదన్నారు. జగన్ కు తనతో వ్యక్తిగత వైరమేమీ లేదన్న పవన్ కేవలం అవినీతి ఆరోపణలున్నాయనే మద్దతివ్వలేదన్నారు. అవినీతి ఆరోపణలున్న వారిని అందలమెక్కిస్తే ప్రజలు ఇబ్బంది పడతారనే తాను ఆరోజు బీజేపీ, టీడీపీలకు మద్దతిచ్చానన్నారు. తనకు సీఎం అయిపోవాలన్న లక్ష్యమేదీ లేదని పరోక్షంగా జగన్ పై సెటైర్ వేశారు. తనకు అధికారం ముఖ్యం కాదని ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యమని పవన్ తెలిపారు. అనుభవం ఉన్నవారే అధికారంలో ఉండాలన్న పవన్, తనకు అధికార దాహమేదీ లేదన్నారు. జగన్ పై తాను ఎందుకు కోపంగా ఉండాలని కూడా ప్రశ్నించారు. ఈరోజు విశాఖలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
- Tags
- జగన్ పవన్
Next Story

