జగన్ పాదయాత్రలో ఉన్నప్పటికీ....!

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు విశేష స్పందన కన్పిస్తోంది. జగన్ ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. వైఎస్ జగన్ కు అరికాళ్లకు బొబ్బలు లేవడంతో లండన్ లో ఉన్న జగన్ కూతురు ఆయన ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. ప్రతిరోజూ రాత్రి జగన్ లండన్ లో ఉన్న కూతురితో మాట్లాడుతున్నారు. ఆమెకు పాదయాత్ర పర్యటన వివరాలు, విశేషాలు తెలుపుతున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా పత్తికొండలో జగన్ పర్యటిస్తున్నారు. మధ్యాహ్న భోజన విరామానికి ప్రస్తుతం జగన్ ఆగారు. ఈ సమయంలో తన వద్దకు వచ్చిన పార్టీ కార్యకర్తలతో జగన్ సమావేశమవుతున్నారు. సెల్ఫీలు దిగుతున్నారు. ఈరోజు భోజన విరామం అనంతరం ఎర్రగుడి, తుగ్గలికి జగన్ చేరుకోనున్నారు. రాత్రికి చెరువు తొండలో బస చేస్తారు. నిన్న 15.6 కిలోమీటర్లు నడిచిన జగన్ ఈరోజు కూడా అదే దూరం ప్రయాణించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. కాలి బొబ్బల నుంచి కొంత ఉపశమనం లభించడంతో జగన్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. లంచ్ సమయంలో ఆయన పార్టీ నేతలతో కూడా ఫోన్ లో చర్చిస్తున్నారు.
7న పోలవరం సందర్శన....
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వివాదం జరుగుతుండటంతో వైసీపీ పోలవరం నిర్మాణాన్ని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాల్సిందిగా జగన్ నేతలను ఆదేశించారు. ఈ నెల 7వ తేదీన వైసీపీ నేతలు పోలవరం బస్సు యాత్ర చేపట్టనున్నారు. పోలవరం పనులు ఎంత వరకూ వచ్చాయి? జాప్యం జరగడానికి కారణాలేంటి? కేంద్రం చెబుతున్న అభ్యంతరాల్లో నిజమెంత? వంటి వాటిని వైసీపీ నేతలు పరిశీలించనున్నారు. గ్రౌండ్ లెవల్ రియాలిటీని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
- Tags
- జగన్ పాదయాత్ర

