Tue Apr 07 2026 08:47:47 GMT+0530 (India Standard Time)
జగన్ పాదయాత్రలో ఉండగానే వైసీపీకి మరో ఎదురుదెబ్బ

వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. జగన్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో పర్యటిస్తుండగానే ఆ జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, వైసీపీ నేత తూర్పు లింగారెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఇందుకోసం కర్నూలులో భారీ బహిరంగ సభనను తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి వరకూ వైసీపీలోనే ఉన్న పారిశ్రామిక వేత్త లింగారెడ్డి కర్నూలు జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. గతకొంత కాలంగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న లింగారెడ్డిని టీడీపీ నేతలు సంప్రదించారు. దీంతో ఆయన టీడీపీ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. డిసెంబర్ 2వ తేదీన కర్నూలు జిల్లాలో జరిగే బహిరంగ సభలో ఆయన టీడీపీలో చేరనున్నట్లు తెలిసింది. జగన్ పాదయాత్రలో ఉండగానే ఆ జిల్లాకు చెందిన నేత పార్టీని వీడటం చర్చనీయాంశమైంది.
- Tags
- వైసీపీ
Next Story

