Mon Apr 06 2026 19:27:32 GMT+0530 (India Standard Time)
జగన్ ను రాళ్లతో కొట్టాలట...టీడీపీ నేత ఫైర్

వైసీపీ అధినేత జగన్ ను రాళ్లతో కొట్టాలట. కేంద్రానికి ఆయన రహస్యంగా లేఖలు రాస్తున్నారట. ఈ మాటలు అన్నది ఎవరోకాదు. కర్నూలు జిల్లా టీడీపీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు. కర్నూలు జిల్లాలో జగన్ పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతుంది జగన్ పార్టీయేనన్నారు సోమిశెట్టి. సీఎం కుర్చీ కోసం జగన్ పాదయాత్ర పేరుతో అలివికాని హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. జగన్ ను పందికొక్కుగా సోమిశెట్టి అభివర్ణించారు. జగన్ కు ఎవరన్నా గౌరవం లేదని, జగన్ ఎప్పటికీ సీఎం కాలేదని సోమిశెట్టి జోస్యం చెప్పారు.
- Tags
- టీడీపీ
Next Story

