Sat Dec 06 2025 10:38:43 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ను చలసాని ఎందుకు కలిశారంటే?

వైసీపీ అధినేత జగన్ ను ఈరోజు ప్రత్యేక హోదా సాధనసమితి సభ్యులు కలిశారు. ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ చేస్తున్న పోరాటం బాగుందని వారు కితాబిచ్చారు. రాజీనామాల విషయం కూడా వీరి వద్ద ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. సభ వాయిదా పడిన వెంటనే తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు దిగనున్నారని, హోదా పోరాటంలో తమతో కలసి రావాలని వారిని జగన్ కోరారు. ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జగన్ ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తో చర్చించారు. గుంటూరు జిల్లాలోని తూర్పు నియోజకవర్గంలో పర్యటిస్తున్న జగన్ ను భోజన విరామ సమయంలో వీరు కలిశారు.
Next Story
