Mon Apr 06 2026 05:19:03 GMT+0530 (India Standard Time)
జగన్ గ్రేట్ బిజినెస్ మెన్ అన్న లోకేష్

వైసీపీ అధినేత జగన్ గ్రేట్ బిజినెస్ మెన్ అని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. 2004 నుంచి 2009 వరకూ జగన్ ఆస్తులు అనూహ్యంగా పెరిగాయని, 2009 తర్వాత జగన్ ఆస్తులు ఎందుకు పెరగలేదని ఎద్దేవా చేశారు. తన తండ్రి సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన పెట్టుబడులు తర్వాత ఎందుకు రాలేదన్నారు. జగన్ ప్రతి శుక్రవారమూ కోర్టుకు వెళ్లడం తప్ప ప్రజాసేవ పట్టడం లేదన్నారు. జగన్ తన ఆస్తులను ప్రకటించి తీరాలన్నారు. జగన్ అతి కొద్ది సమయంలో అన్ని ఆస్తులను ఎలా మూటగట్టుకున్నారన్నారు. తాము హెరిటేజ్ ద్వారానే ఆస్తులను సంపాదించామని లోకేష్ వివరించారు.
- Tags
- జగన్ లోకేష్
Next Story

