Sat Mar 28 2026 15:28:43 GMT+0530 (India Standard Time)
జగన్ గుట్టువిప్పుతానంటున్న ఆది

తనపై జగన్, విజయసాయి రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆదినారాయణరెడ్డి ఫైర్ అయ్యారు. జగన్ చరిత్ర మొత్తం విప్పుతానని చెప్పారు. జగన్ తాత రాజారెడ్డి చరిత్ర నుంచి తన వద్ద ఉందని జగన్ కు ఆదినారాయణరెడ్డి సవాల్ విసిరారు. జగన్ తాత రాజారెడ్డి బైరైటీస్ గనుల కోసం నర్సయ్యను హత్య చేయించింది వాస్తవం కాదా అని మంత్రి ప్రశ్నించారు. జగన్ కుటుంబ చరిత్రకు, తన కుటుంబ చరిత్రకు పొంతనే లేదని చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఆదినారాయణరెడ్డి. రామసుబ్బారెడ్డి, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. సీబీఐ కేసులు పెట్టుకుని తనను విమర్శించే స్థాయి జగన్ కు, విజయసాయికి లేదని మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు.
Next Story

