Thu Mar 26 2026 20:31:18 GMT+0530 (India Standard Time)
జగన్ కు ముందే ఎలా తెలుస్తున్నాయి?

వైసీపీ కి బీజేపీ కీలక నిర్ణయాలు ముందుగానే ఎలా తెలిసిపోతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగే ప్రతి పరిణామం ముందుగానే వైసీపీకి తెలియడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాధ్ కోవింద్ ను విజయసాయి రెడ్డి ముందుగానే ఎలా కలిశారన్నారు. తనకు అమిత్ షా చెప్పే వరకూ రాష్ట్ర పతి అభ్యర్థి రామ్ నాధ్ కోవింద్ అనితెలియదన్నారు. దీన్ని బట్టి వైసీపీ ఢిల్లీలో ఎలా లాబీయింగ్ చేస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. వైసీపీ లాబీయింగ్ పై చంద్రబాబు శాసనసభలో ప్రత్యేక హోదా పై చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
- Tags
- జగన్ చంద్రబాబు
Next Story

