Wed Apr 01 2026 17:47:01 GMT+0530 (India Standard Time)
జగన్ కు పండగ కలిసొచ్చిందే...!

వైసీపీ అధినేత జగన్ ఈరోజు కూడా పాదయాత్ర చేయనున్నారు. కోర్టుకు సెలవలు కావడంతో ఆయన ఈరోజు కూడా చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేయనున్నారు. ప్రతి శుక్రవారం జగన్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే గత వారం కూడా కోర్టుకు సెలవు కారణంతో జగన్ హాజరుకాలేదు. ఈరోజుకూడా సంక్రాంతి సెలవులు ఉండటంతో జగన్ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని వైసీీపీ నేతలు చెబుతున్నారు. దీంతో ఈరోజు జగన్ పాదయాత్ర 60వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో జగన్ యాత్ర జరుగుతోంది.
- Tags
- జగన్
Next Story

