Sat Mar 21 2026 17:45:55 GMT+0530 (India Standard Time)
జగన్ కు జ్వరం..పాదయాత్ర....?

వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్రకు ఈరోజు విరామమిచ్చారు. తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన వైద్యుల సూచన మేరకు పాదయాత్రకు ఈరోజు విరామం ప్రకటించారు. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం నియోజకవర్గంలో జగన్ పర్యటిస్తున్నారు. ఎండ వేడిమి అధికంగా ఉన్నప్పటికీ జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అయితే నిన్న రాత్రి జ్వరం తీవ్రత ఎక్కువ కావడంతో వైద్యులు పాదయాత్ర చేయవద్దని సూచించారు. ీదీంతో జగన్ పాదయాత్రకు ఈరోజు విరామం ప్రకటించారు.
Next Story

