Sat Apr 04 2026 03:14:23 GMT+0530 (India Standard Time)
జగన్ ఈరోజు మధ్యాహ్నం పాదయాత్ర...కు బ్రేక్ ఇస్తారా?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 41వ రోజుకు చేరుకుంది. ఈరోజు మధ్యాహ్నం వరకే ఆయన పాదయాత్ర చేయనున్నారు. మధ్యాహ్నం నుంచి ఆయన రోడ్డు మార్గాన హైదరాబాద్ బయలుదేరి రావాల్సి ఉంది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర పుట్టపర్తి నియోజకవర్గం నల్లమద వద్ద ఉన్నారు. ఈరోజు ఉదయం అక్కడి నుంచి బయలుదేరి రాగానిపల్లి, గోపెపల్లి, రామాపురం, బొగ్గులపల్లి మీదుగా జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. బొగ్గలపల్లిలో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. రేపు శుక్రవారం కావడంతో సీబీఐ కోర్టుకు జగన్ హాజరు కావాల్సి ఉంది. దూరప్రాంతంలో ఉన్న జగన్ హైదరాబాద్ చేరుకోవాలంటే మధ్యాహ్నం యాత్ర ముగించక తప్పదు. వైసీపీ అధినేత జగన్ షెడ్యూల్ కూడా అలాగే ఉంది. బొగ్గల పల్లి లో జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన రోడ్డు మార్గాన హైదరాబాద్ బయలుదేరి రానున్నట్లు తెలిసింది.
- Tags
- జగన్
Next Story

