జగన్ అనుకున్నట్లే....చేశారే....!

వైసీపీ అధినేత జగన్ మాట తప్పలేదు. గతంలో నెల్లూరు జిల్లా నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇస్తామని ఇవ్వలేక పోయారు. దీంతో వేమిరెడ్డి అటు టీడీపీ వైపు వెళ్లాలని చూశారు. కాని ఇటీవలే జగన్ నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్ సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీలో చేరిపోయారు. ఈ సందర్భంగా రాజ్యసభకు పంపుతామని జగన్ వేమిరెడ్డికి మాట ఇచ్చారన్న వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ధృవీకరించారు. త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికలలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నిలపెడతామని విజయసాయి రెడ్డి ప్రకటించారు. తమకు 44 మంది ఎమ్మెల్యే మద్దతుందన్న విజయసాయి రెడ్డి, తమ అభ్యర్థి సులువుగా విజయం సాధిస్తారని చెప్పారు. అయితే తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కళావెంకట్రావు, టీజీ వెంకటేశ్, యరపతనేని శ్రీనివాసరావులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మొత్తం మీద అనుకున్నట్లుగానే జగన్ వేమిరెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించారని విజయసాయి రెడ్డి ప్రకటన ద్వారా తేలిపోయింది.
- Tags
- జగన్

