చైనా గురి ఎవరివైపు?

చైనా యుద్ధానికి సిద్ధమవుతుందా? ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తోంది. కాని యుద్ధ సన్నాహాలు మాత్రం చైనా చేస్తుండటం అంతర్జాతీయ సమాజంలో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు యుద్ధం వచ్చినా సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ సైన్యానికి పిలుపునిచ్చారు. అత్యున్నత సైనికాధికారులతో భేటీ అయిన జిన్ పింగ్ యుద్ధానికి సిద్ధం చేయాలని మిలటరీ కమిషన్ కు సూచించడం గమనార్హం. చైనాకు దాదాపు 23 లక్షల సైన్యం ఉంది. సైన్యం అంతా సెంట్రల్ కమిషన్ నేతృత్వంలోనే పనిచేస్తుంది. మిలటరీ కమిషన్ కు కూడా చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
జిన్ పింగ్ వ్యాఖ్యల్లో అర్థమేంటి?
అయితే జిన్ పింగ్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారన్న చర్చ నడుస్తోంది. చైనా భారత్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసిందా అన్న సందేహం కూడా తలెత్తతోంది. రెండోసారి జిన్ పింగ్ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత దూకుడుగా వెళ్లేందుకే నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో సాయుధ బలగాలన్నింటీనీ సిద్ధం చేయాలని, సమరానికి రెడీ గా ఉండాలని జిన్ పింగ్ చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. జిన్ పింగ్ ప్రకటనపై భారత్ ఒక కన్నేసి ఉంచింది. చైనా కదలికలను పసిగడుతుంది.
- Tags
- చైనా

