Sat Apr 11 2026 00:28:29 GMT+0530 (India Standard Time)
చిరంజీవి ఇంట్లో దొంగలు పడ్డారు..!

రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దొంగలు పడ్డారు. రెండు లక్షల నగదును ఎత్తుకెళ్లారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఈచోరీ జరిగింది. కాగా రెండు లక్షల నగదును ఎత్తుకెళ్లింది చిరంజీవి పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నచెన్నయ్య ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. చెన్నయ్య అలియాస్ చిన్నాను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి వ్యక్తిగత కార్యదర్శి గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకునిదర్యాప్తుచేస్తున్నారు.
- Tags
- చిరంజీవి
Next Story

