Tue Feb 03 2026 23:02:19 GMT+0000 (Coordinated Universal Time)
చినబాబూ...ఎవిడెన్స్ లున్నాయి

తాను ఆరోపణలు చేసిన వాటికి ఆధారాలున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఒక జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన పవన్ లోకేష్ పై తాను చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆధారాలున్నాయన్నారు. అవి సరైన సమయంలో బయటపెడతానని చెప్పారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తాను అలా ఎలా మాట్లాడతానని ప్రశ్నించారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే చూపాలని లోకేష్ కూడా సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానని, ఏపీకి బీజేపీ, టీడీపీ రెండూ మోసం చేశాయని ఆయన ఆవేదన చెందారు. ప్రధాని మోడీని తాను వ్యక్తిగతంగా మాత్రమే ఆరాధిస్తానని, రాజకీయంగా కాదని పవన్ చెప్పారు.
- Tags
- పవన్ కల్యాణ్
Next Story
