Thu Mar 26 2026 23:07:42 GMT+0530 (India Standard Time)
చావు కబురు చల్లగా చెప్పిన కేంద్రం

విశాఖ రైల్వే జోన్ ఇక లేనట్లే. కేంద్రం తేల్చి చెప్పేసింది. విశాఖ రైల్వే జోన్ కోసం ఏపీలో ఉద్యమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విభజన చట్టంలో ఉన్న రైల్వే జోన్ ను ఇస్తామని ఇప్పటి వరకూ కేంద్రం చెబుతూ వస్తుంది. అయితే చావు కబురు చల్లగా చెప్పింది కేంద్రం. ఏపీకి రైల్వే జోన్ ఇక లేనట్లేనని కేంద్రం చెప్పేసింది. ప్రస్తుతం తాము చేసిన అథ్యయనం ప్రకారం రైల్వే జోన్ సాధ్యం కాదని ఏపీ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ కు కేంద్ర హోం శాఖ కార్యదర్శి స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Next Story

