Fri Apr 03 2026 13:29:36 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు స్థానంలో యనమల

నేడు గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఈ ప్రమాణస్వీకారానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కావడం లేదు. ఆయన తన స్థానంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని పంపారు. మామూలుగా అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి చంద్రబాబు హాజరవుతూ వస్తున్నారు. అయితే ఈసారి మాత్రం ముఖ్యమైన సమావేశం ఉండటంతో చంద్రబాబు విజయ్ రూపానీ ప్రమాణస్వీకారానికి హాజరుకావడం లేదు.
- Tags
- చంద్రబాబు
Next Story

