చంద్రబాబు, జగన్ లను ఉతికేసిన ఉండవల్లి

మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ కుమార్ తాజాగా సంచలన వ్యాఖలు చేశారు. పట్టిసీమ మీద పెట్టిన శ్రద్ధ పోలవరం మీద పెట్టాలని చంద్రబాబు కు చురకలు వేశారు. పోలవరం ప్రాజెక్ట్ పై తాను చెప్పిన అంశాలు అన్ని నిజం అయ్యాయని తాజాగా కేంద్ర రాష్ట్రాల నడుమ జరుగుతున్న పరిణామాలు అన్ని రుజువు చేస్తున్నాయని ఇప్పటికైనా బాబు పోలవరం పై నిజాలు చెప్పాలి అని ఉండవల్లి డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ లో పనులు ఏమాత్రం సజావుగా సాగడం లేదని ఏపీకి జీవనాడి అని చెబుతున్నారని అది తొందరగా పూర్తి చేయకపోతే తెలంగాణాలో నిర్మితమయ్యే ఎత్తిపోతల పధకాల వల్ల ఇక్కడి పొలాలు నీటికోసం ఎండిపోతాయన్నారు. ప్రస్తుతం గోదావరి డెల్టా కు రబీలో నీరులేదంటున్నారని, కృష్ణా డెల్టా కు తరలించడం వల్లే సంక్షోభం వచ్చిందని సాక్షాత్తు టిడిపి ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు నీటి సంఘం అధికారుల సమావేశంలోనే విమర్శించారని గుర్తు చేశారు అరుణ కుమార్.
సింగపూర్ కి రాజధాని రైతుల ....
చంద్రబాబు ఏం చేస్తున్నారు ? సింగపూర్ కి అమరావతి రైతులు ను పంపడం ఏమిటి ? అరచేతిలో వైకుంఠం చూపించే రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసే జిమ్మిక్కులు చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు అరుణ కుమార్. ఒక పక్క రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటుంటే కేంద్రాన్ని డిమాండ్ చేసి నిధులు సాధించలేక పోతున్నారని ఉండవల్లి విమర్శించారు. చంద్రబాబు అంతా తన గుప్పిటలో ఉందంటున్నారని పోలవరం పై గుప్పిట విప్పి నిజాలు చెప్పాలన్నారు.
జగన్ పార్టీ నిర్ణయం పైనా....
జగన్ ప్రజా సమస్యలు కోసం పాదయాత్ర చేయడాన్ని ఉండవల్లి అరుణ కుమార్ స్వాగతించారు. కానీ అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు.‘ఎన్నో సమస్యలు వున్నాయి.రాష్ట్రంలో అవన్నీ అసెంబ్లీలో వైసిపి సభ్యులు మాట్లాడాలి కదా ? పోలవరం పై నిలదీయాలి. రాష్ట్ర ఆర్ధిక దుస్థితి అప్పులు చేస్తున్న తీరు ఎండగట్టాలి, నంద్యాలలో మాత్రమే డ్వాక్రా వారికి నిధులు ఎందుకు ఇచ్చారు? రాష్ట్రం అంతా ఎందుకు ఇవ్వలేదు ఇవన్నీ ఎవరు అడుగుతారు . ఈ నిర్ణయం పూర్తిగా ఆత్మహత్య సదృశం’ అని ఉండవల్లి ఘాటుగా వ్యాఖ్యానించారు . ఇప్పటికైనా జగన్ అసెంబ్లీ కి తన పార్టీ సభ్యులను పంపి పోరాడాలని సూచించారు. ఇంకా సమయం ఉన్నందున పాదయాత్ర లోనే తన సభ్యులకు దిశా నిర్దేశం చేయాలన్నారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ పై అంత సీరియస్ అఖ్ఖర్లేదు ....
సినిమాలు చూసి జనం ఏమి మారిపోరని ఉండవల్లి వ్యాఖ్యానించారు . లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాదంపై ఆయన ఈ కామెంట్స్ చేశారు. గతంలో తానే మూడు సినిమాలు తీశానన్నారు. దీనిపై అంత సీరియస్ గా ఎందుకు విమర్శలకు దిగుతున్నారని అన్నారు అరుణ కుమార్. వీరగంధం లక్ష్మి పార్వతి అంటూ మరో సినిమా కూడా వస్తుంది కదా అందుకు టిడిపి ఖంగారు పడాలిసిన పని లేదన్నారు మాజీ ఎంపీ .

