చంద్రబాబుపై జగన్ ఇలా....ఇలా...ఇలా...!

ఏపీ మంత్రి నారాయణ స్కూళ్ల కోసం మోడల్ స్కూళ్లను చంద్రబాబు నాశనంచేశారని వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. ఆయన కర్నూలు జిల్లాలోని పత్తికొండ బహిరంగ సభలో కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. చంద్రబాబు బినామీ నారాయణ కావడం వల్లనే ప్రభుత్వ సూళ్లు మూతబడుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలన్నీ నిర్వీర్యం చేశారన్నారు. కనీసం రేషన్ షాపులో బియ్యం కూడా దొరకని పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉందన్నారు. ప్రతి పేదవాడికీ ఇల్లు కట్టిస్తానని చెప్పిన చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నాలుగేళ్లవుతన్నా ఒక్క ఇల్లు కూడా కట్టించారా? అని అడుతున్నానన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్న చంద్రబాబు, ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు ఏం చేశారన్నారు. నిరుద్యోగులకు భృతి కల్పిస్తామనిచెప్పిన చంద్రబాబు మాట తప్పారని ఆయన నిప్పులు చెరిగారు. ప్రతి ఇంటికీ 90 వేల రూపాయల నిరుద్యోగ భృతి చంద్రబాబు బాకీ పడ్డారన్నారు.
- Tags
- జగన్

