Mon Mar 30 2026 01:57:01 GMT+0530 (India Standard Time)
చంద్రబాబుకు కేంద్రమంత్రుల ఫోన్...ఇందుకే...!

తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో ఆందోళన కొనసాగిస్తున్నారు. సభ్యుల ప్రసంగాలను అడ్డుకుంటున్నారు. రాష్ట్రపతి ప్రసంగాలకు ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చ జరుగుతోంది. అయితే ప్రధాని మోడీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. ప్రధానికూడా మాట్లాడనున్నారు. అయితే టీడీపీ ఎంపీలు మాత్రం నిరసనను తెలియజేస్తున్నారు. దీంతో కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్, కేంద్రమంత్రి అనంతకుమార్ లు చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రధాని మాట్లాడేటప్పుడైనా ఆటంకం కల్గించకుండా చూడాలని కోరారు. అయితే స్పష్టమైన హామీ ఇవ్వాల్సి ఉంటుందని చంద్రబాబు వారిని కోరినట్లు తెలిసింది. అయితే లోక్ సభలో ఎంపీలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ మండిపడ్డారు. చిన్న పిల్లల్లా ప్రవర్తించవద్దని విసుక్కున్నారు. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్లి పిల్లలకు ఏం చెబుతారని స్పీకర్ ప్రశ్నించారు.
- Tags
- చంద్రబాబు
Next Story

