Tue Apr 07 2026 01:16:39 GMT+0530 (India Standard Time)
గోల్కొండ కోటలో పసందైన విందు

ప్రపంచ పారిశ్రామికవేత్తలకు, అతిధులకు తెలంగాణ ప్రభుత్వం గోల్కొండ కోటలో పసందైన విందు ఇస్తోంది. ఇప్పటికే గోల్కొండ కోటను ట్రంప్ కుమార్తె ఇవాంకా సందర్శించారు. గోల్కొండ కోటలో మరికాసేపట్లో విందు ప్రారంభమవుతోంది. ఈ విందులో అన్నీ తెలంగాణ వంటకాలనే రుచి చూపిస్తున్నారు. హైదరాబాద్ బిర్యానీతో ఖుర్బానీకా మీఠా, ధమ్ కా బిర్యానీ వంటివి తయారు చేశారు. తెలంగాణ సంస్కృతికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం యాభై బస్సుల్లో అతిధులను గోల్కొండ కోటకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

