Fri Jun 09 2023 17:11:13 GMT+0000 (Coordinated Universal Time)
గుంటూరు గొడవకు ఫుల్ స్టాప్

తెలుగుదేశం పార్టీలో గుంటూరు వివాదాన్ని ఎట్టకేలకు మంత్రులు పరిష్కరించగలిగారు. మంత్రి రావెల, జడ్పీ ఛైర్మన్ జానీమూన్ ల మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక వర్గంపై ఒకరు
ఆరోపించుకుంటూ మీడియా కెక్కడంతో ముఖ్యమంత్రి దీనిపై త్రిసభ్య కమిటీని నియమించారు. అయితే ఆదివారం మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాధ్ రెడ్డిలు వివాదాన్ని పరిష్కరించగలిగారు.
మంత్రులు ఇచ్చిన హామీతో తాను సంతృప్తి చెందానని జడ్పీ ఛైర్ పర్సన్ జానీమూన్ మీడియాకు వివరించారు. తనకు, రావెలకు మధ్య తలెత్తిన వివాదం ముగిసినట్లేనని చెప్పారు. మంత్రి రావెల కూడా మీడియాతో మాట్లాడారు. తనకు, జానీమూన్ కు మధ్య ఎలాంటి వివాదాలు లేవని, భవిష్యత్ లో కూడా అవి పునరావృత్తం కాకుండా చూస్తానని రావెల హామీ ఇచ్చారు. జడ్పీ ఛైర్మన్ గా జానీమూన్ కొనసాగుతారని మంత్రి పత్తిపాటి చెప్పారు.
- Tags
- జానీమూన్
Next Story