Sun Dec 28 2025 21:25:00 GMT+0000 (Coordinated Universal Time)
గిన్నిస్ బుక్‌లోకి బతుకమ్మ : తెలంగాణ ఘనత!

తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయ ప్రతీక బతుకమ్మ గిన్నిస్ బుక్ లోకి ప్రవేశించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ అరుదైన ఘనతను సాధించింది. ఎల్బీస్టేడియంలో శనివారం నాడు మహా బతుకమ్మను ఏర్పాటుచేసి.. పదివేల మంది మహిళలతో బతుకమ్మ ఆడించడం ద్వారా గిన్నిస్ బుక్కు అర్హమైన అరుదైన ఫీట్ ను తెలంగాణ ప్రభుత్వం సాధించింది.
ఈ కార్యక్రమంలో విదేశీ వనితలు ఎంతో మంది తెలుగు సాంప్రదాయ వస్త్రధారణలో పట్టుచీరలు కట్టుకుని మరీ.. బతుకమ్మ ఆడారు. అలాగే.. తెలంగాణ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బతుకమ్మ ఆడారు.
రికార్డెడ్‌గా 9292 మంది ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఇప్పటిదాకా ఓనం పండుగ నిర్వహణలో కేరళీయులు నమోదు చేసిన గిన్నిస్ రికార్డును ఈ బతుకమ్మ ద్వారా తెలంగాణ అధిగమించింది.
Next Story

