Thu Apr 09 2026 15:53:11 GMT+0530 (India Standard Time)
గాలి కామినేనిని దెబ్బకొట్టారే...!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరగుతున్నాయి. ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు, మంత్రి కామినేని శ్రీనివాస్ ల మధ్య శాసనసమండలిలో మాటల యుద్ధం జరిగింది. పెద్దయెత్తున జరుగుతున్న అవినీతి జరుగుతుందన్నారు. రక్తపరీక్షలకు ప్రభుత్వం ఖరారు చేసిన సంస్థ భారీగా అవినీతికి పాల్పడుతుందన్నారు. ఐదుగురికి రక్త పరీక్షలు చేసి యాభై మందికి చేసినట్లు చూపిస్తున్నారన్నారు. అయితే దీనిపై మంత్రి కామినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వీపింగ్ కామెంట్స్ చేయడం తగదన్నారు. నిబందనలప్రకారమే తాము రక్తపరీక్షల కాంట్రాక్టును ఇచ్చామన్నారు. మొత్తం మీద మండలి లో గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.
Next Story

