Wed Apr 01 2026 23:38:46 GMT+0530 (India Standard Time)
గవర్నర్ పై బీజేపీ నేత గరం...గరం...!

బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పై మరోసారి ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా ఒక గవర్నర్ కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని పార్లమెంటులో ఏపీ ఎంపీలంతా కలిసికట్టుగా ప్రస్తావించాలని విష్ణుకుమార్ రాజు కోరారు. గవర్నర్ ఏపీలో పట్టుమని పది రోజులు కూడా ఉండరన్నారు. నాలా బిల్లు పంపితే నాలుగు నెలల నుంచి ఆమోదం తెలపలేదన్నారు. గవర్నర్ నరసింహన్ ఏరోజూ కుటుంబ పెద్దలా వ్యవహరించలేదని మండిపడ్డారు. తాము కూడా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళతామని చెప్పారు.
Next Story

