Wed Apr 01 2026 13:51:19 GMT+0530 (India Standard Time)
గజల్ కు సంక్రాంతి జైలులోనే....!

గజల్ శ్రీనివాస్‌కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. శుక్రవారం మరోసారి నాంపల్లి కోర్టులో గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లైంగిక వేధింపుల కేసులో జైలుపాలైన గజల్ శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేయడానికి నాంపల్లి కోర్టు తిరస్కరించింది. లైంగిక వేధింపుల కేసులో శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై 354, 354 ఏ, 509 నెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. శ్రీనివాస్ తరపు న్యాయవాది వినిపించిన వాదలనతో ఏకీభవించిన న్యాయమూర్తి గజల్ శ్రీనివాస్ పెట్టుకున్న బెయిలు పిటిషన్‌ను కొట్టివేశారు. ఈ నెల 18 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. దీంతో శ్రీనివాస్‌ను తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు
- Tags
- గజల్ శ్రీనివాస్
Next Story

