Sat Apr 04 2026 20:45:48 GMT+0530 (India Standard Time)
క్యూ లైన్లో నిలబడి మరీ మోడీ ఓటేశారు...!

గుజరాత్ లో చివరి దశ పోలింగ్ కు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. అహ్మదాబాద్ లోని రనిప్ లో ఆయన తన ఓటు హక్కును వినయోగించుకున్నారు. క్యూలైన్లో నిలబడి మరీ మోడీ ఓటు వేయడం గమనార్హం. మోడీని చూసేందుకు జనం ఎగబడ్డారు. క్యూలైన్లో నిలబడి ఉన్న కొందరు ఓటర్లు మోడీతో ముచ్చటించారు. చివరి దశపోలింగ్ లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నరస్ పరలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అహ్మదాబాద్ లోని వెజల్ పూర్ లో ఓటు వేశారు. మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ కూడా ఘట్లోడియాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- Tags
- మోడీ ఓటు
Next Story

