Mon Apr 06 2026 03:57:34 GMT+0530 (India Standard Time)
కోర్టు విచారణ తర్వాత జగన్ ఏం చేశారంటే...?

సీబీఐ కోర్టులో జగన్ విచారణ పూర్తయింది. దీంతో ఆయన హైదరాబాద్ నుంచి జగన్ అనంతపురం జిల్లాకు బయలుదేరారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈరోజు సీబీఐ కోర్టకు జగన్ హాజరయిన సంగతి తెలిసిందే. విచారణను ఈ నెల 15వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. విచారణ పూర్తయిన వెంటనే జగన్ రోడ్డు మార్గంలో బయలు దేరి అనంతపురం జిల్లా బాపన పల్లికి బయలు దేరారు. రేపటినుంచి పాదయాత్రలో యధావిధిగా జగన్ పాల్గొంటారు. మరోవైపు కోర్టు విచారణకు పూర్తయిన తర్వాత జగన్ వైసీపీసీనియర్ నేతలతో సమావేశమయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు, పోలవరం ప్రాజెక్టును వైసీపీ నేతల సందర్శన వంటి అంశాలపై జగన్ వారితో చర్చించారు. ఎల్లుండి పాదయాత్ర జరిగే దగ్గర వైసీపీ పార్లమెంటరీ సమావేశం ఏర్పాటు చేయాలని జగన్ నేతలను ఆదేశించారు.
- Tags
- జగన్
Next Story

