Mon Mar 30 2026 13:01:35 GMT+0530 (India Standard Time)
కోర్టు ప్రాంగణంలో జగన్ ఏం చేశారంటే...?

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు. ప్రతి శుక్రవారం ఆయన నాంపల్లి లోని సీబీఐ కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు పాదయాత్రకు జగన్ విరామం ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం జగన్ పాదయాత్ర సాగుతోంది. పొదలకూరు సమయంలో పాదయాత్రకు విరామం ప్రకటించిన జగన్ ఈరోజు కొద్దిసేపటి క్రితం సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. జగన్ తో పాటు విజయసాయి రెడ్డి కూడా హాజరయ్యారు. కోర్టు ప్రాంగణంలోనే జగన్ సీనియర్ నేతలు, ఎంపీలతో జగన్ చర్చించారు. బడ్జెట్లో ఏపీకి జరుగుతున్న అన్యాయం. తెలుగుదేశం పార్టీలో జరగుతున్న పరిణామాలపై జగన్ సీనియర్ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది.
- Tags
- జగన్
Next Story

