కోర్టు నో చెప్పినా .. అన్నొస్తున్నాడు...?

జగన్ పాదయాత్ర సిబిఐ కోర్టు నో చెబితే ఆగిపోతుందన్న ప్రచారాలకు వైసిపి బ్రేక్ వేసింది. ఒక వేళ కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదని తమకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా పాదయాత్రను వైసిపి అధినేత కొనసాగిస్తారని ఆ పార్టీ నాయకురాలు రోజా ఊహాగానాలకు తెరదించారు. ప్రతి శుక్రవారం జగన్ సిబిఐ కోర్ట్ ముందు హాజరుకావలిసి వుంది. పాదయాత్ర తలపెట్టిన నేపథ్యంలో తనకు 6 నెలలపాటు మినహాయింపు కోరుతూ వైసిపి అధినేత కోర్టు ను అభ్యర్ధించారు . ఆ అభ్యర్థనపై కోర్టు తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు.
అపోహలకు చెక్ పెట్టేందుకే ...
వారం వారం కోర్టు కి హాజరు కావలిసిన విపక్ష నేత పాదయాత్ర చేయలేరని ఆయన యాత్ర చేస్తా అని ప్రకటించిన నాటినుంచి టిడిపి ముమ్మరంగా ప్రచారం సాగిస్తుంది. ఆ ప్రచారం అలా ఉండగానే జగన్ అక్టోబర్ లో తలపెట్టిన పాదయాత్ర కాస్తా నవంబర్ కి వాయిదా పడింది . ఈ నేపథ్యంలో ఆ ప్రచారం మరింత ముమ్మరం చేసింది టిడిపి సర్కార్ . దాంతో క్యాడర్ కి నేతలకు పూర్తి క్లారిటీ ఇచ్చేందుకు వైసిపి మీడియా తో ఈ అంశాన్ని పంచుకుంది. ఏది ఏమైనా అవసరమైతే కోర్టు కి వెళ్ళి వస్తూ అయినా అధినేత పాదయాత్ర కొనసాగిస్తారని ప్రకటించడంతో ఆ పార్టీ వర్గాల్లో ఉత్సహం వెల్లివిరుస్తుంది .
- Tags
- జగన్

